Homeతెలంగాణలీడర్ల కోపతాపాలు రైతుల మీద రుద్దొద్దు

లీడర్ల కోపతాపాలు రైతుల మీద రుద్దొద్దు

– మంత్రులు రూల్స్​ బ్రేక్​ చేస్తే నోటీసులు ఇవ్వాల్సింది
– కానీ రైతు బంధు ఎందుకు ఆపారు
– ఇది ఆన్​ గోయింగ్​ స్కీమ్​
– ఎంపీ కేశవరావు, బీఆర్ఎస్​ నేతలు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రాజకీయనేతల కోప తాపాలు రైతుల మీద ఎందుకు చూపుతున్నారని బీఆర్ఎస్​ ఎంపీ కే కేశవరావు ప్రశ్నించారు. తాజాగా ఎన్నికల సంఘం రైతు బంధు నిధులను ఆపిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్​ ఎంపీ, ప్రతినిధుల బృందం ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు వెళ్లింది. మంత్రులు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడితే నోటీసులు ఇవ్వాలని కానీ రైతు బంధు నిధులు ఎందుక ఆపారని ఆయన ప్రశ్నించారు. రైతు బంధు ఆన్​ గోయింగ్​ స్కీమ్​ అని గుర్తు చేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా నిధులను ఆపడం ఏమిటని ప్రశ్నించారు. ఈసీఐతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కోర్టుకు వెళ్లేందుకు టైమ్ లేదని.. మేము రేపటి వరకూ విత్ డ్రా చేయించే ప్రయత్నం చేస్తామన్నారు. లేదంటే రైతులు అర్థం చేసుకోవాలని.. రెండు మూడు రోజులు ఓపిక పట్టాలని కేశవరావు తెలిపారు.

Recent

- Advertisment -spot_img