తీజ్ వేడుక బతుకమ్మ పండుగను పోలి ఉంటుంది. పెళ్లికాని యువతులు తొమ్మిదిరోజులపాటు భక్తిశ్రద్ధలతో మట్టిని, మొలకలను ఆరాధిస్తారు. బంజారా మహిళలు, యువతుల ఆటపాటలు, నృత్యాలు, డప్పుల మధ్య భక్తిభావంతో తొమ్మిదిరోజులపాటు ఉపవాసాలు ఉండి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, తండాలు, గ్రామాల్లోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకవద్దని కోరుతూ పూజిస్తారు.