పాముల జాతర గురించి మీకు తెలుసా.. ఇది బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం నాగ పంచమి రోజున జిల్లాలోని సింఘియాలో ఈ జాతర జరుగుతుంది. ఈ జాతరలో వందలాది మంది పాములను పట్టుకొని పాల్గొంటారు. బుధి గండక్ నదిలో స్నానం చేసి.. అదే సమయంలో పాములను చేతిలో పట్టుకుని..నోటిలో కరిపించుకొని నీటి నుంచి బయటకు తీసి ఊరేగింపుగా గుడికి వెళ్తారు. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం.