Homeహైదరాబాద్latest NewsWorld లోనే అతిపెద్ద Anaconda దీని పొడవెంతో తెలుసా ?

World లోనే అతిపెద్ద Anaconda దీని పొడవెంతో తెలుసా ?

ప్రపంచంలో అతిపెద్ద అడవిగా అమెజాన్ రెయిన్‌ ఫారెస్ట్ గుర్తింపు పొందింది. ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. ఈ వర్షారణ్యం జీవవైవిధ్యానికి నెలవు. ఈ దట్టమైన అడవి విభిన్నమైన పక్షులు, జంతువులు, కీటకాలకు ఆవాసంగా ఉంది. 5.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచానికి 25 శాతం ఆక్సిజన్ అందిస్తోంది. ఇక్కడ అనేక రకాల జీవజాతులను శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తిస్తున్నారు. తాజాగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో కొత్త జాతికి చెందిన గ్రీన్ అనకొండను ఓ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. . గతంలో ఎప్పుడూ చూడని విధంగా అతిపెద్ద అనకొండను గుర్తించారు. ఇటీవల టీవీ వైల్డ్ లైఫ్ ప్రెజెంటర్ ప్రొఫెసర్ ఫ్రీక్ వోంక్ నేషనల్ జియోగ్రాఫిక్ యాత్రలో ఈ అనకొండను కనుగొన్నారు.ఈ భారీ అనకొండకు సంబంధించిన వీడియోను ప్రొఫెసర్ వోంక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఎలాంటి భయం లేకుండా అతిపెద్ద అనకొండను పట్టుకుని కనిపించాడు. ‘నేను చూసిన అతి పెద్ద అనకొండ ఇదే.. కారు టైర్ అంత మందంగా ఉంది. ఈ భారీ అనకొండ 26 అడుగుల పొడవు, 440 పౌండ్ల బరువు ఉంది. ఈ పాము తల మనిషి తల సైజులో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ పాము జాతి ప్రపంచంలోనే అతి పెద్దదని, చాలా బరువైన పాముగా పేర్కొన్నారు. విల్ స్మిత్‌తో నేషనల్ జియోగ్రాఫిక్స్ డిస్నీ ప్లస్ సిరీస్ ‘ పోల్ టు పోల్’ సాహస యాత్ర సమయంలో ఈ జాతి పామును గుర్తించారు. ఈ కొత్త జాతి పాముకు లాటిన్ పేరు ‘యునెక్టెస్ అకాయిమా’ అని పరిశోధకులు పెట్టారు. అంటే..ఉత్తర ఆకుపచ్చ అనకొండ అని అర్థం.కారు టైర్‌లా మందంగా, ఎనిమిది మీటర్ల పొడవు, 200 కిలోల బరువు ఉంది. దాని తల ఎంత భారీగా ఉందొ చుస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాము రాక్షసున్ని తలపిస్తుంది.’ అని వోంక్ తెలిపారు.ఇదో అతిపెద్ద రాక్షస అనకొండ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ అనకొండలు తరచుగా ఆహారం కోసం అత్యంత వేగంగా కదులుతాయి. ఈ పాముల బలమైన శరీరాలను ఊపిరి పీల్చుకోవడానికి వాటిని పూర్తిగా మింగడానికి ఉపయోగిస్తాయి

Recent

- Advertisment -spot_img