Homeహైదరాబాద్latest NewsTarak కు ఎన్ని భాషలు వచ్చో తెలుసా

Tarak కు ఎన్ని భాషలు వచ్చో తెలుసా

నందమూరి నట వారసుడిగా ‘నిన్ను చూడాలని’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు తారక్​. రౌద్రం, వీరం, బీభత్సం, శాంతం, కరుణ, హాస్యం.. ఇలా నవరసాలను అలవోకగా పండించగలిగే నటుల్లో ఆయన ఒకరు. అందుకే ‘నటనలో నీ తర్వాతే ఎవరైనా’ అని అంటారు ఆయన సినిమాలను చూసిన వారందరూ. సింగిల్‌ టేక్‌లో భారీ సంభాషణలు చెప్పదగ్గ, అదిరిపోయే స్టెప్పులు వేయగలిగే నటుడాయన. గుక్క తిప్పుకోకుండా భారీ డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్​కు సరిసాటి ఎవరూ రాలేరు. డైలాగ్ డెలివరీ గాని, డాన్స్​లో జోష్, ఫైట్స్​లో ఎన్టీఆర్ స్పీడ్​కు సిల్వర్​స్క్రీన్​ సైతం ఊగిపోవాల్సిందే. కెరీర్​ల ఆరంభంలోనే ఆది, సింహాద్రి చిత్రాలతో మాస్ హీరోగా ప్రేక్షకుల మనసును కొల్లగొట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రాల సక్సెస్​తో ఎన్నో అవకాశాలను అందుకొని స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్​గా నటించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఎన్టీఆర్​లో నటన మాత్రమే కాకుండా ఇంకా మరెన్నో టాలెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి అనేక భాషల‌ు మాట్లాడడం. సాధారణంగా హీరోలు తమ ప్రాంతీయ భాషతో పాటు హిందీ లేదా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంకొంతమంది సౌత్​ హీరోలైతే ప్రాంతీయ భాషతో పాటు మరో రెండు దక్షిణాది భాషలను మాట్లాడగలతారు. కానీ ఎన్టీఆర్​ మాత్రం అనర్గంలా దాదాపు తొమ్మిది భాషలు మాట్లాడతారట. వీటిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్​, జాపనీస్, స్పానిష్ లు ​ ఉన్నాయి. కాగా, ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్​లోనూ ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడి భాషలో మాట్లాడి సైతం ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఏదేమైనప్పటికీ ఫ్యాన్స్​.. తమ అభిమాన హీరో ఇన్ని భాషల్లో మాట్లాడతారా అని తెలుసుకుని తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్​.. కొరటాల శివ, ప్రశాంత్​ నీల్​తో కలిసి రెండు భారీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీస్​ కోసం తన మేకోవర్​ చేంజ్​ చేసే పనిలో బిజీ అయ్యారాయన.

Recent

- Advertisment -spot_img