డ్రై ఫ్రూట్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. 100 గ్రాముల బాదంపప్పు ద్వారా సుమారు 21 గ్రాములు ప్రోటీన్లను పొందవచ్చు. దీనిలో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ ఇ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 100 గ్రాముల వాల్ నట్స్‌తో 15 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. ఈ నట్స్‌లో ఆల్ఫా లినోలియిక్ యాసిడ్ ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.