HomeHealthకాటేసే ముందు పాము ఏం చేస్తుందో తెలుసా..

కాటేసే ముందు పాము ఏం చేస్తుందో తెలుసా..

– ఈ విషయాలు తెలుసుకుంటే పాము బారి నుంచి తప్పించుకోవచ్చు

పాముల ప్రవర్తన గురించి తెలుసుకుంటే, దాని కాటుకు గురయ్యే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. “విషం అనేది పాములకు వేటాడే ఆయుధం. దీని ద్వారానే అవి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అందుకే విషాన్ని చాలా జాగ్రత్తగా వాడతాయి. తప్పించుకోవడానికి దారేదీ కనిపించని పరిస్థితుల్లోనే పాము మనిషిని కాటు వేస్తుంది. ఇలా కాటు వేసే ముందు, ఒక్క కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెప్తున్నారు.

కట్లపాము ఎప్పుడు కాటువేస్తుందో చెప్పలేం. మిగిలిన పాములు మాత్రం కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ ‘హిస్స్.. హిస్’ అని శబ్ధం చేస్తాయి. శరీరాన్ని నేలపై బలంగా కదిలిస్తూ శబ్ధం చేయడం వంటివి చేస్తాయి.

“కట్లపాము విషయానికి వస్తే, రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటుంది. రాత్రి నుంచి ఉదయం వరకు ఆహారం కోసం వేటాడుతుంది. అందుకే రాత్రి సమయంలో ఎక్కువగా ఈ పాము కాటు ప్రమాదాలు చోటచేసుకుంటాయి. మిగిలిన పాములు పంట పొలాలు, నిర్మాణ ప్రదేశాలలో కనిపిస్తాయి. అవి బూడిద, గోధుమ రంగుల్లో ఉంటాయి కాబట్టి, ఈ ప్రదేశాల్లో సులభంగా దాక్కొని ఆహారం కోసం వేటాడతాయ. అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దేశంలోని ప్రధాన నాలుగు విషపూరిత పాముల్లో కట్లపాము, నాగుపాము విషం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ఈ పాముల విషాన్ని న్యూరోటాక్సిక్ గా పిలుస్తాం. వైపర్ జాతికి చెందిన రక్తపింజర, చిన్నపింజర పాములు కరిస్తే, వాటి విషం నేరుగా రక్తంలో కలిసిపోయి, అంతర్గత రక్తస్రావానికి దారి తీస్తుంది.

ఈ విషాన్ని హెమటోటాక్సిక్ అని పిలుస్తాం” అని అంటారు. “న్యూరోటాక్సిక్ నేరుగా నాడి వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీనివలన పక్షవాతం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. హెమటోటాక్సిక్ నేరుగా రక్తంలో కలిసిపోయి, అంతర్గత రక్తస్రావానికి దారి తీస్తుంది. పాము కాటుకు గురైన 15-20 నిముషాల నుంచి విషం ప్రభావం శరీరంలో కనిపించడం మొదలవుతుంది. 30-45 నిముషాల సమయంలో విషం శరీరమంతా వ్యాపిస్తుంది. విషపూరిత లక్షణాలు కనిపించడానికి సుమారు రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతుంది.

4-6 గంటల్లో తీవ్రత గరిష్టస్థాయికి చేరుకుంటుంది. పాము కాటు వేసిన భాగంలో మాత్రమే నొప్పి తీవ్రంగా ఉంటుంది. అయితే, పాము కాటు వేస్తే, లక్షణాలు వెంటనే కనిపించవు. “పాము కోరలు ఇంజెక్షన్ లాంటివి. ఇంజెక్షన్ ను ఎలాగైతే నేరుగా కండరంలోకి, లేదా నరంలోకి, లేదంటే చర్మపు పొరర మధ్యన ఇస్తారో, అలాగే పాము విషం కూడా శరీరంలోకి మూడు విధాలుగానే ప్రవేశిస్తుంది. పాము కాటుకు గురైన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి, సంబంధిత డాక్టర్ దగ్గరకు వెళ్లి వెంటనే చికిత్స తీసుకోవాలి. అంతేకాని మంత్రాలతో విషాన్ని తీసేస్తామని ప్రచారం చేసుకునే బాబాల దగ్గరకు వెళ్లకూడదు”.

పాము కాటుకు గురైన వ్యక్తికి ముందు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. ఆందోళన పడకోడదు. సాధ్యమైనంత త్వరగా దగ్గరలోని ఆసుపత్రికి లేదా వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. పాము కాటుకు గురైన వ్యక్తిని కదల్చకూడదు. దీని వలన విషం వేగంగా శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంది. గాయానికి కట్టు కట్టడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది. పాము కాటుని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి క్షణమూ విలువైనదే అని గుర్తుంచుకోవాలి.

Recent

- Advertisment -spot_img