Powerful Passport: అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లో సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది. వీసా లేకుండా 195 దేశాలకు ప్రయాణించవచ్చు. ఆ తర్వాత జపాన్ 2వ స్థానంలో నిలిచింది.. ఆ తరువాత 3వ స్థానంలో ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, దక్షిణ కొరియా, స్పెయిన్ లు ఉన్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్ 4వ స్థానంలో ఉన్నాయి. భారత్ 5 స్థానాలు దిగజారి 85వ స్థానానికి పడిపోయింది.
ALSO READ : Hundred Note: రూ.100 నోటు కి రూ.56.49 లక్షలు.. ఇందులో అంత స్పెషల్ ఏంటంటే..!
Powerful Passport: టాప్ 10 శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు ఇవే:
- సింగపూర్ (195 గమ్యస్థానాలు)
- జపాన్ (193)
- ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా (192)
- ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే (191)
- బెల్జియం, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ (190)
- గ్రీస్, ఆస్ట్రేలియా (189)
- కెనడా, పోలాండ్, మాల్టా (188)
- హంగేరి, చెకియా (187)
- ఎస్టోనియా, యునైటెడ్ స్టేట్స్ (186)
- లిథువేనియా, లాట్వియా, స్లోవేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (185)