నేటి డిజిటల్ యుగంలో గూగుల్ మ్యాప్ మన జీవితంలో ఒక భాగంగా మారింది. మనం తెలియని ప్రదేశానికి వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్ మనకు తోడుగా మారుతుంది. దీని నావిగేషన్ సర్వీస్ మీరు ఏ ప్రదేశానికి చేరుకోవాలో అనే విషయంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే దాదాపు ప్రతి ఒక్కరు ఒక్కసారైన గూగుల్ మ్యాప్‌ను వినియోగించే ఉంటారు. అయితే గూగుల్ మ్యాప్‌లో మధురంగా వినిపించే ఆ స్త్రీ స్వరం ఎవరిదో తెలుసా? గూగుల్ మ్యాప్‌లో గొంతు వినిపించే మహిళ పేరు కరెన్ ఎలిజబెత్ జాకబ్సెన్. ఆమె ఆస్ట్రేలియన్ మూలానికి చెందినది. ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. కరెన్ ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. ఆమె వాయిస్‌ను 2011 నుండి 2014 వరకు యాపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్లలో సిరి అప్లికేషన్‌లో ఉపయోగించారు.