Homeహైదరాబాద్latest Newsభూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసా..?

భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసా..?

ఈ మధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసా? భూమి లోపల ఉండే మందపాటి పొర 7 భాగాలుగా విభజించబడి ఉంటుంది. వీటినే టెక్టోనిక్ ప్లేట్లు అంటారు. అయితే ఈ ప్లేట్లు లోపల తిరుగుతూ ఉంటాయి. ఈ పలకలు చాలా బలంగా కదిలినప్పుడు.. మనకు భూప్రకంపనలు వస్తాయి. దీని కారణంగా భౌగోళిక శక్తి విడుదలై భూకంపాలు సంభవిస్తాయి.

భూకంప తీవ్రతను ఎలా కొలుస్తారంటే.. భూకంప తీవ్రతను తెలుసుకోవడానికి రిక్టర్ స్కేలుపై 1 నుంచి 9 వరకు కొలుస్తారు. 0-1.9 వరకు సమాచారం సీస్మోగ్రాఫ్ నుంచి మాత్రమే పొందబడుతుంది. 2-2.9 కాంతి మెరిసినట్లుగా అనుభూతి, 3-3.9 వరకు ఒక ట్రక్కులో వెళ్లినప్పుడు ఎలా అయితే అనుభూతి చెందుతామో.. ఇదే విధమైన ప్రభావం. 4-4.9 ఇళ్ల కిటికీలు, ఫోటో ఫ్రేమ్‌లు పడిపోవచ్చు. 5-5.9 ఫర్నిచర్ అంతా కిందపడుతుంది. 6-6.9 భవనాల పునాదులు పగలవచ్చు. 7నుంచి ఆపై భవనాలు కూలిపోతాయి.

Recent

- Advertisment -spot_img