Homeహైదరాబాద్latest NewsOlympics: ఒలింపిక్స్ చిహ్నం ఐదు రింగులు ఎందుకుంటాయో తెలుసా? వాటి రంగులకు అర్ధం ఏంటి..? ఒలింపిక్...

Olympics: ఒలింపిక్స్ చిహ్నం ఐదు రింగులు ఎందుకుంటాయో తెలుసా? వాటి రంగులకు అర్ధం ఏంటి..? ఒలింపిక్ చిహ్నం ప్రత్యేకతేంటంటే..?

ఒలింపిక్ చిహ్నం ఐదు రింగులను కలిగి ఉంటుంది. ఒక్కో రింగ్ ఒక్కో రంగులో ఉంటుంది. ఒలంపిక్ రింగుల చిహ్నం తొలిసారిగా 1913లో కనిపించింది. . ఆధునిక ఒలింపిక్ గేమ్స్‌కి పితామహుడైన పీయర్ డి కెబర్టిన్.. లేటిన్ ఫ్రేజ్ నించి తీసుకున్నారు. అతను ఒలింపిక్ ప్రమాణాన్ని కూడా వ్రాసాడు. గెలవడం ముఖ్యం కాదని, ఒలింపిక్స్‌లో పాల్గొనడమే ముఖ్యం అనే నినాదాన్ని కూడా ప్రవేశపెట్టాడు. 1913 ఒలింపిక్ సమీక్షలో కెబర్టిన్ మాట్లాడుతూ.. ఐదు రింగులు నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, మరియు ఎరుపు ఉంటాయని, వాటికి వెనుక బ్యాక్ గ్రౌండ్ తెల్ల రంగు ఉంటుందని తెలిపారు.
ఒలింపిక్ చిహ్నమైన ఐదు రింగ్స్ పూర్తిగా ఆధునిక ఆవిష్కరణ. 1914లో ప్రపంచ దేశాలని కలపాలనే ఉద్దేశంతో ఒలింపిక్ గేమ్స్‌ని తొలిసారిగా ప్రపంచవ్యాప్తం చేసినప్పుడు ఐదు ఖండాలకి సింబల్‌గా ఐదు రింగ్స్‌ని రూపొందించారు. అయితే వీటికి వాడే రంగులు ఏ రంగు ఏ ఖండానికి చెందినదో వివరణ లేదు. ఉదాహరణకు స్వీడన్‌కు నీలం, పసుపు, గ్రీసుకు తెలుపు, నీలం, ఫ్రాన్సు, యూనైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, బెల్జియం, ఇటలీ, హంగేరీలకు మూడు రంగులు, స్పెయిన్‌కు పసుపు, ఎరుపు.. ఇలా అన్ని దేశాల రంగులు ఉన్నాయి. ఉదాహరణకు, స్వీడన్‌లో నీలం,పసుపు, గ్రీస్‌లో తెలుపు, నీలం, అలాగే ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, బెల్జియం, ఇటలీ, హంగేరీ మూడు రంగులను కలిగి ఉంటాయి. ఇంకా స్పెయిన్ పసుపు మరియు ఎరుపు రంగులను కలిగి ఉంటాయి.

Recent

- Advertisment -spot_img