ఏదైనా సంఖ్యను వెయ్యిలో చెప్పాలంటే దానికి ఆంగ్ల అక్షరం ‘K’ అని రాయడం తరచూ చూస్తుంటాం. ఉదాహరణకు 2000కు 2K అని అంటుంటాం. ఇది గ్రీకు పదం ‘chilioi’ నుంచి వచ్చింది. గ్రీకు భాషలో ‘చిల్లోయ్’ అంటే వెయ్యి. కానీ వారు దాన్ని కిల్లోయ్ పిలుస్తారు. ఆ కిల్లోయ్ నుంచే కిలో అన్న పదం పుట్టింది. కిలోగ్రాం అంటే వెయ్యి గ్రాములు, కిలోమీటర్ అంటే వెయ్యి మీటర్లు అన్నట్లుగా వెయ్యికి బదులు ‘K’ని షార్ట్కట్లా వ్యవహరించడం మొదలైంది.