Homeఫ్లాష్ ఫ్లాష్బిగ్ బాస్ షో, అవతార్ సినిమా చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్

బిగ్ బాస్ షో, అవతార్ సినిమా చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్

అమరావతి: బిగ్ బాస్ షో అవతార్ సినిమాను చూపిస్తూ ఓ వ్యక్తికి వైద్యులు ఆపరేషన్ చేశారు.

గుంటూరులో సర్వజనాసుపత్రి లో చికిత్స తీసుకుంటున్న ఓ వ్యక్తి కి వైద్యులు ఇలా ఆపరేషన్ చేసి వార్తల్లో నిలిచారు.

పాటిబండ్లకు చెందిన వరప్రసాద్ కు మెదడులో బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడ్డది.

హైదరాబాద్ లో ఓ ఆస్పత్రిలో దాన్ని తొలగించాక మళ్లీ పెరగడంతో తరుచూ ఫిట్స్ వస్తున్నాయి.

మాటలు, సంభాషణకు సంబంధించిన ప్రాంతంలో ఆపరేషన్ చేస్తుండటంతో రోగి స్పృహలో ఉండడం అవసరం.

పేషెంట్ మెలకువగా ఉంటేనే మెదడులో కలిగే పరిణామాలను వైద్యుల గమనిస్తూ ఆపరేషన్ పూర్తి చేశారు.

పేషెంట్ కు బీమా ఉండటంతో రోగికి పైసా ఖర్చు కాకుండానే వైద్యం అందజేసినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img