Homeహైదరాబాద్latest Newsఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

ఇదే నిజం , జోగిపేట: జోగిపేట కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 97 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జోగిపేట క్లాక్ టవర్ దగ్గర దొడ్డి కొమురయ్య చిత్రపటానికి అధ్యక్షుడు బిర్ల శంకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో పోరాటాలు చేశారని ఆయన గుర్తుచేశారు. కురుమల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని, ఆయనను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంఘం సభ్యులు కడల లక్ష్మీనారాయణ, గొల్ల కృష్ణ, కేఆర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img