Homeహైదరాబాద్latest Newsడాగ్ ఫ్రీ కంట్రీ అంటూ కొత్త చట్టం.. ఇక నుంచి అక్కడ కుక్కలే ఉండవట..!

డాగ్ ఫ్రీ కంట్రీ అంటూ కొత్త చట్టం.. ఇక నుంచి అక్కడ కుక్కలే ఉండవట..!

ఈ రోజుల్లో కుక్కలు మనుషులపై దాడి చేయడం తరుచు చూస్తున్నాం. కుక్కలు రోడ్ల పై వెళ్తున్న వారిపై దాడి చేసి గాయపరుస్తున్నారు. అలాగే కుక్కలు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరిపైనా దాడులు చేస్తున్నాయి. వీధికుక్కల దాడిలో పలువురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కుక్కలపై దాడుల నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలావుంటే.. కుక్కల కోసం ఓ దేశం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అరబ్ దేశాల సరిహద్దులో ఉన్న టర్కీలో ఈ కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇక్కడి ప్రభుత్వం డాగ్ ఫ్రీ కంట్రీ అంటూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. వీధుల్లో తిరిగే లక్షలాది పట్టి వాటిని షెల్టర్లలో పెట్టాలని టర్కీ పార్లమెంట్ మంగళవారం జూలై 30 ఓ బిల్లును ఆమోదించింది. టర్కీలో ఉన్న దాదాపు 4 మిలియన్ల శునకాలను పట్టి షెల్టర్లకు తరలించాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. కొత్త చట్టాన్ని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ పార్టీ ప్రతిపాదించింది. చికిత్స ద్వారా నయం చేయలేని వ్యాధులు ఉన్న కుక్కలను పూర్తిగా నిర్మూలించాలని చట్టం పేర్కొంది. టర్కీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img