Homeఅంతర్జాతీయందేశంలో ఆ మాంసం బ్యాన్.. ఏకంగా కొత్త చట్టమే

దేశంలో ఆ మాంసం బ్యాన్.. ఏకంగా కొత్త చట్టమే

ఇండియాలో చికెన్, మటన్, ఫిష్ తినడం మామూలే. ఇతర దేశాల్లో అయితే పాములు, కప్పలు, చిన్న చిన్న పురుగులను కూడా వదలకుండా తింటారు. అయితే, ఏ దేశంలో అయినా ఆహారం మీద ఆంక్షలు పెట్టడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ, దక్షిణ కొరియా మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంలో ఎవరైనా కుక్క మాంసం కొనుగోలు చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అంతేకాదు.. ఈ మేరకు ద‌క్షిణ కొరియా పార్లమెంట్ చ‌ట్టాన్ని రూపొందించింది. కుక్క మాంసం వినియోగాన్ని నిషేధిస్తూ కొత్తగా బిల్లును ఆమోదించింది. కాగా, ఎన్నో ఏళ్ల నుంచి ద‌క్షిణ కొరియాలో కుక్క మాంసం వినియోగంలో ఉన్నది. ఇప్పుడు సడన్‌గా బ్యాన్ చేయడంతో ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరీ.

Recent

- Advertisment -spot_img