Dog suicide bridge : ఆ వంతెన మీద 600 కుక్కలు ఆత్మహత్య..
ఎలైస్‌కు తన పెంపుడు కుక్క ‘క్యాసీ’ అంటే ఎంతో ప్రేమ. సాయంత్రంపూట ఆ కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లడం ఆమెకు ఓ దినచర్య.
ఈ క్రమంలో ఇద్దరూ ఓ బ్రిడ్జి మీద నుంచి వాకింగ్ చేస్తున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు.
ఒక్కసారిగా క్యాసీ బ్రిడ్జి మీద నుంచి కిందకు దూకేసింది.
హఠాత్పరిణామానికి ఒక్కసారిగా ఎలైస్ కుప్పకూలిపోయింది.
ఆ బ్రిడ్జిని ‘డాగ్ సూసైడ్ బ్రిడ్జి’గా పిలుస్తారని, ఆ వంతెన మీదకు కుక్కలను తీసుకెళ్లడం ఎంతమాత్రం మంచిది కాదని తెలుసుకొని ఎలైస్ కంపించిపోయింది.
సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ ఘటన 2014లో నిజంగానే జరిగింది.
ఇదొక్కటే కాదు.. స్కాట్లాండ్‌లోని ఓవర్‌టౌన్ బ్రిడ్జి మీద నుంచి గత 70 ఏండ్లలో దాదాపు 600కు పైగా కుక్కులు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాయి.
50 అడుగుల లోతు, కింద నీళ్లు కూడా ఉండకపోవడంతో 50 కుక్కల వరకు చనిపోయాయి.
అందుకే ఈ బ్రిడ్జిని ‘డాగ్ సూసైడ్ బ్రిడ్జి’గా పిలుస్తున్నారు.
ఏమై ఉంటుంది?
ఓవర్‌టౌన్ బ్రిడ్జి మిస్టరీ తెలుసుకోవడానికి ఎంతోమంది పరిశోధకులు ప్రయత్నాలు చేశారు.
అయితే, ఆ గుట్టును తెలుసుకోలేకపోయారు.
ఆ బ్రిడ్జి మీద ఆత్మలు తిరుగుతుంటాయని, కుక్కలు ఆత్మహత్య చేసుకోవడానికి అదే కారణమని కొందరి నమ్మకం.
కాగా ఓవర్‌టౌన్ అనే బ్రిటిష్ మహిళ భర్త 1908లో మరణించాడు.
భర్త జ్ఞాపకాలతో మానసికంగా కుంగిపోయిన ఆమె.. ఆ ఆవేదనతోనే 30 ఏండ్ల తర్వాత మరణించారు.
ఆమే ఆత్మ రూపంలో బ్రిడ్జిపై తిరుగుతున్నట్టు చెబుతున్నారు.