Homeజిల్లా వార్తలుఅవయవ దానం చేయండి

అవయవ దానం చేయండి

ఇదే నిజం, కాశిబుగ్గ వరంగల్‌: అవయవ దానం అత్యున్నతమైన దానమని తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ అన్నారు. మంగళవారం కరీమాబాదులో జరిగిన సామాజికవేత్త ముల్క ఐలయ్య ఆధ్వర్యంలో జరిగిన అవయవ దాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మృతి చెందిన తర్వాత అవయవాలను కాల్చడం ద్వారా ఎవరికి ఉపయోగపడకుండా బూడిద పాలు అవుతాయన్నారు. మరణించిన తరువాత మన అవయవాలను ఇతరులకు దానం చేస్తే మనం మరణించిన మన అవయవాల ద్వారా జీవిస్తామన్నారు. ఎంతో మంది అవయవాలు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తప్పని సరిగా దానం చేయాలని సూచించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img