Homeహైదరాబాద్latest Newsరక్తదానం చేయడం అపారమైన మానవియత: జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి

రక్తదానం చేయడం అపారమైన మానవియత: జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి

ఇదేనిజం, ధర్మపురి: రక్త దానం చేయడం,రక్త ధాతలతో చేయించడంలో అపారమైన మానవియత దాగి ఉందని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి అన్నారు. రక్త దానం చేయడం, చేయించడంతో పాటు కరోనా విపత్కర సమయంలో తన ఆటోనే అంబులెన్సుగా మార్చి 103 రోజులు కరోనా పేషేంట్లకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించడం తో పాటు, భోజన వసతి కల్పించిన జగిత్యాలకు చెందిన సామాజిక సేవకులు చింత సుధీర్ హైదరాబాద్ కు చెందిన సంస్థ ఇటీవల “మహా మయురా సేవా అవార్డ్” అందించిన సందర్భంగా గురువారం స్థానిక దేవిశ్రీ గార్డెన్లో జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు సుధీర్ ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి మాట్లాడుతూ రక్తదాణంతో ఒకరికి ప్రాణధానం చేసినట్లవుతుందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్త దానం చేయడం ఆపదలో సాయం చేసినట్లేనని తెలిపారు. జగిత్యాల జిల్లాలో మొట్టమొదటి సారిగా ఒక సామాన్య వ్యక్తి 6 వేలకు పైగా రక్తదానాలు చేయించి తాను స్వయంగా 54 సార్లు రక్తదానం చేసి సుధీర్ సమాజంలో అదర్శంగా నిలిచాడని కిషన్ రెడ్డి కొనియాడారు. కృత్రిమంగా దొరకని రక్తాన్ని దానం చేయడమంటే వారు జీవితంలో రాణిస్తారనే దానికి సంకేతమన్నారు. ఉదారతతో రక్తదానం అభాగ్యులకు ప్రాణ దానం లాంటిదని చెబుతూ యువత రక్తదానం చేయడానికి చైతన్యం తీసుకువస్తున్నా సుధీర్ ను సన్మానించుకోవడం బాధ్యత అని కిషన్ రెడ్డి తెలిపారు. సుధీర్ తో కేకు కట్ చేయించగా పాత్రికేయులు శాలువలతో సన్మానించి జ్ఞపికను అందజేశారు. కార్యక్రమంలో పాత్రికేయులు ద్యావర సంజీవరాజు, కళాశ్రీ గుండేటి రాజు, తిరునగరి శ్రీనివాస్,పెండెం మహేందర్, పిస్క సంపత్, కొంకటి మహేంద్ర నాథ్,ఆముధ లింగారెడ్డి, చింత రోజా, తారక్, టీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img