బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాల్లో ఆ పార్టీ నేతలను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు.నవంబర్ మొదటి వారంలో అరెస్టులు ఉంటాయన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజమైన బాంబులకు భయపడేది లేదని.. ఏం చేస్తారో చేసుకోండి సవాల్ విసిరారు.చంద్రబాబు, వైఎస్ఆర్ లాంటి వారితో పోరాడామని.. మీరో లెక్కా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి ముందు తన ఈడీ కేసుల గురించి, మోదీ కాళ్ళు మొక్కిన బాంబుల గురించి చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.సీఎం రేవంత్ బామ్మర్ది, పొంగులేటి బాగోతాలు అన్నీ బయటకు తీస్తామని.. చావుకు మేం భయపడమని కేటీఆర్ తెలిపారు.