బంజరు భూముల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దని మంత్రి సీతక్క అటవీశాఖ అధికారులకు సూచించారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఆమె మాట్లాడుతూ… ఆదివాసీలకు ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని కల్పించిన పోరాటయోధుడు కొమురం భీమ్ అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లక్షా అరవై వేల ఎకరాల బంజరు భూములకు పట్టాలు ఇచ్చామన్నారు. పోడు భూముల విషయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని సూచించారు. గిరిజనులకు అన్ని విషయాల్లో అవగాహన కల్పించాలన్నారు. అటవీ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.