Homeసినిమాఅలాంటి వాటిని లైట్​ తీసుకోవద్దు..

అలాంటి వాటిని లైట్​ తీసుకోవద్దు..

హీరోయిన్ రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె మరోసారి స్పందించారు. ఆమె నటించిన తాజా సినిమా ‘యానిమల్‌’డిసెంబర్‌ 1న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఆమె తన డీప్‌ ఫేక్‌ వీడియో, ట్రోల్స్‌పై మాట్లాడారు. ‘దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఫేక్‌ వీడియోలు క్రియేట్ చేయడం కామన్ అయిపోయింది. అలాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు కచ్చితంగా మనం స్పందించాలి. నాకు తొలుత అమితాబ్ బచ్చన్‌ సపోర్ట్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందిన చాలా మంది మద్దతు తెలిపారు. మొదట్లో ఆ వీడియో చూసి బాధపడ్డా. చాలా మంది సెలబ్రిటీలకు ఇలానే జరుగుతోంది. ఏం చేయగలం అనిపించింది. దీన్ని సాధారణంగా తీసుకోకూడదనుకున్నా. అందుకే స్పందించాను. ఈ సందర్భంగా నేను అమ్మాయిలందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఏదైనా సంఘటన మిమ్మల్ని ప్రభావితం చేసి బాధిస్తే.. మీరు నిశ్శబ్దంగా ఉండొద్దు. కచ్చితంగా స్పందించండి. అప్పుడు మీకు ప్రజల మద్దతు లభిస్తుంది. మనం గొప్ప దేశంలో నివసిస్తున్నాం’ అని చెప్పారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై మాట్లాడుతూ.. ‘నాకు ప్రతి విషయంలో చాలా సపోర్ట్‌ ఉంటుంది. ఇక నటీనటులు, క్రికెటర్లపై మీమ్స్‌, ట్రోల్స్‌ కామన్. అలాంటి వాటిని పట్టించుకోకూడదు’ అన్నారు. ఇక ‘యానిమల్‌’ విషయానికొస్తే.. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌-రష్మిక ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img