Homeహైదరాబాద్latest NewsDouble smart: “డబుల్ ఇస్మార్ట్” తో రామ్ పోతినేని ఆ క్లబ్ లో చేరనున్నాడా?

Double smart: “డబుల్ ఇస్మార్ట్” తో రామ్ పోతినేని ఆ క్లబ్ లో చేరనున్నాడా?

డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రాబోతున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ డబుల్ ఇస్మార్ట్‌ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కానీ స్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.అదే తరహా లో మంచి కలెక్షన్లు రాబట్టుకుంటే డబుల్ ఇస్మార్ట్ 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమా రామ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా టీజర్ అప్డేట్ రివీల్ చేస్తూ.. మే 15న రామ్ బర్త్ డే కానుకగా డబుల్ ఇస్మార్ట్ క్రేజీ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img