Homeసినిమానిహారిక ఎంగేజ్మెంట్ కి పవర్ స్టార్ ఎందుకు రాలేదు?

నిహారిక ఎంగేజ్మెంట్ కి పవర్ స్టార్ ఎందుకు రాలేదు?

• సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న చర్చ
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమార్తె నిహారిక ఎంగేజ్మెంట్ గురువారం హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని ట్రెడెంట్ హోటల్ లో నిహారిక, జొన్నలగడ్డ చైతన్య ఎంగేజ్మెంట్ కరోనా ఆంక్షల కారణంగా నిరాడంబరంగా జరిగింది. చిరంజీవి ఫ్యామిలీ, నాగబాబు ఫ్యామిలీ, అల్లు అరవింద్ ప్యామిలీ.. పెళ్లి కొడుకు తరపున వారి బంధువులు అందరూ హాజరయ్యారు. కానీ మెగాస్టార్ ఫ్యామిలీ లో జరిగిన ఈ ఫంక్షన్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. పవన్ తరపున కనీసం ఆయన భార్య, పిల్లలు కూడా ఈ ఫంక్షన్ కి రాలేదు. హైదరాబాద్ లోనే ఉన్న పవన్ ఎంగేజ్మెంట్ కి రాకపోవడం వెనుక ఉన్న కారణం ఏంటి.. అన్న చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. సినీ వర్గాలు, జనసేన నాయకులు కథనం ప్రకారం.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్ష చేస్తున్నారు. నిహారిక ఎంగేజ్మెంట్ కి రాలేనని ముందుగానే సమాచారమిచ్చారట. పెళ్లికి కచ్చితంగా వస్తానని, తన శుభాకాంక్షలు ఫోన్ ద్వారా తెలిపారట. బాబాయ్ మాట కాదనలేక నిహారిక కూడా సరేనందట. వారి అనుమతితోనే పవన్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదట. చతుర్మాస దీక్ష కారణంగానే వేడుకలకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటు న్నరట. మరీ ముఖ్యమైనవి అయితేనే టెలి కాన్ఫరెన్స్ లతో సరిపెడుతున్నారు. ఇటీవల నితిన్ పెళ్లికి పవన్ ముఖ్య అతిథిగా వెళ్లారు. చాతుర్మాస దీక్షలో ఉండి కూడా హాజరు కావడం గమనార్హం.

Recent

- Advertisment -spot_img