Homeతెలంగాణజోగినీలకు అండగా నిలబడతాం

జోగినీలకు అండగా నిలబడతాం

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్​ ఎర్రోళ్ల శ్రీనివాస్

హైదరాబాద్​ : తెలంగాణ రాష్ట్రంలో దురాచారాలు రూపుమాపాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్​ ఎర్రోళ్ల శ్రీనివాస్. జోగినీలు, ఎన్జీఓ సంస్థల ప్రతినిధులతో సోమవారం బషీర్​బాగ్​లోని కమిషన్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జోగినీల స్థితిగతులు, ఎదుర్కుంటున్న పలు సమస్యల గురించి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కొందరు జోగిని ప్రతినిధులు వివరించారు.

ఈ క్రమంలో కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను ఉన్న జోగినీ వ్యవస్థపై, జోగినీలు ఎదుర్కుంటున్న సమస్యలను, ప్రభుత్వం కల్పించిన ఉపాధి తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లకు లేఖలు కమిషన్ తరపున రాశారు. నివేదికలు రాగానే ఆయా జిల్లాల్లో జోగినీలు ఎదుర్కుంటున్న సమస్యలు, ప్రభుత్వం అందించాల్సిన ఉపాధి తదితర అంశాలపై చొరవ చూపుతాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాంబల్ నాయక్ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img