Homeతెలంగాణరోడ్డుమీదికి డ్రైనేజీ నీళ్లు… నడవడమే గగనం

రోడ్డుమీదికి డ్రైనేజీ నీళ్లు… నడవడమే గగనం


ఇదేనిజం, లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపలిటీ పరిధిలో రోడ్డు సరిగా లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 9వ వార్డులో అంగన్వాడీకి వెళ్ళే దారిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగు నీరు రోడ్ మీద ప్రవహిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ యువజన నాయకులు అయిల్ల విజయ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కోడ్ అయిపోగానే సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజశేఖర్ హామీ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img