Homeహైదరాబాద్latest Newsడ్రైవింగ్ లైసెన్స్‌లో కొత్త రూల్స్..ఎప్పటినుంచి అంటే?

డ్రైవింగ్ లైసెన్స్‌లో కొత్త రూల్స్..ఎప్పటినుంచి అంటే?

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇకనుంచి RTO ఆఫీస్‌‌లో టెస్ట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ సంస్థలు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు జారీ చేస్తాయని అధికారులు తెలిపారు. ఈ నిబంధనలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలు

ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం కోసం కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. ఫోర్‌ వీలర్ ట్రైనింగ్‌ కోసమైతే అదనంగా 2 ఎకరాల స్థలం ఉండాలి.

  • శిక్షణ సమయం
  • లైట్ వెహికల్ శిక్షణ తప్పనిసరిగా 4 వారాల్లో పూర్తి చేయాలి (కనీసం 29 గంటలు). శిక్షణను రెండు విభాగాలుగా విభజించాలి. ఇందులో థియరీ విభాగం 8 గంటలు, ప్రాక్టికల్‌ 21 గంటలు ఉండాలి.
  • హెవీ మోటారు వాహనాల కోసం 38 గంటల శిక్షణ ఉంటుంది. ఇందులో 8 గంటల థియరీ ఎడ్యుకేషన్, 31 గంటల ప్రాక్టికల్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ శిక్షణ 6 వారాల్లో పూర్తవుతుంది.
  • శిక్షకులకు కనీసం హై స్కూల్‌ డిప్లొమా అర్హత తప్పనిసరి. దీంతో కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలి.

Recent

- Advertisment -spot_img