Homeహైదరాబాద్latest Newsరాష్ట్రవ్యాప్తంగా 'డ్రగ్స్ అండ్ డ్రైవ్' టెస్టులు

రాష్ట్రవ్యాప్తంగా ‘డ్రగ్స్ అండ్ డ్రైవ్’ టెస్టులు

డ్రగ్స్ వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది. పూర్తిస్థాయిలో నిషేధించేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు గాను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ తరహాలో డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. దీనికోసం రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో ప్రత్యేకంగా ఎబోన్ యూరిన్ కప్ అనే కిట్‌ను తయారు చేసి పోలీసుశాఖకు అందించింది. ఇప్పటికే స్టేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ కిట్లు చేరాయి.

డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో.. ఎవరైనా గంజాయి సహా ఇతర డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులకు అనుమానం వచ్చిన పక్షంలో ‘ఎబోన్ యూరిన్ కప్’ కిట్ ద్వారా మూత్ర పరీక్ష నిర్వహిస్తారు. అప్పుడు ఆ పరికరంలో రెండు ఎర్ర గీతలు కనిపిస్తే నెగెటివ్​గా, అదే సింగిల్ లైన్ కనిపిస్తే ‘పాజిటివ్’గా పరిగణిస్తారు. అలా పాజిటివ్​గా వచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని తదుపరి పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి ప్రదేశాల్లో అనుమానాస్పదంగా తిరిగే వారిని లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం.

Recent

- Advertisment -spot_img