Homeహైదరాబాద్latest Newsఒడిశా టూ హైదరాబాద్.. వయా అమెజాన్

ఒడిశా టూ హైదరాబాద్.. వయా అమెజాన్

Idenijam, Webdesk : రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా భారీగా డ్రగ్స్ పట్టుబడుతోంది. అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా ఎంతకైనా తెగిస్తూ మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. యువత జీవితాలతో చెలగాటం ఆడుతూ వారి జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యేందుకు కారణం అవుతున్నారు. తాజాగా ఒడిశా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసేందుకు ఓ ముఠా సాంకేతికతను వాడుకున్న తీరును చూస్తే ఎంతకు తెగించారో అర్థమవుతుంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా పార్సిల్‌లో గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో మేడ్చల్ పోలీసులు, ఎస్‌ఓటీ బృందం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని నౌపాడా ప్రాంతానికి చెందిన గిర్దారి కొద్ది రోజుల క్రితమే తన స్వస్థలానికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కిలో రూ. 2500 చొప్పున రెండు కేజీల గంజాయిని కొనుగోలు చేశాడు. అక్కడ నుంచి హైదరాబాద్‌లోని లాల్ బజార్‌కు చెందిన తన స్నేహితుడు రోహిత్‌కు కిలోకు 1000 వేల రూపాయలకు అమ్మే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో మేడ్చల్ ప్రాంతంలోని రేకులబావి చౌరస్తా వద్ద గంజాయి ప్యాకెట్లు మార్చుకునేందుకు యత్నించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న గిర్దారి, అమెజాన్ పికప్ బాయ్‌ను పోలీసులు ప్రశ్నించగా గంజాయి వ్యవహారం బయటపడింది. గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిర్డారి 2009 నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

Recent

- Advertisment -spot_img