సమ్మర్లో ఎండవేడి నుంచి తట్టుకునేందుకు కూల్ డ్రింక్స్, లస్సి వంటివి తాగేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదు.
కూల్‌డ్రింక్స్, లస్సీ, గుట్కా, మిల్క్‌షేక్..ఇలా దాదాపు అన్నిటిలో డ్రగ్స్ వాడుతూ యువతకు అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల కంట పడకుండా ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని శంషాాబాద్ ప్రాంతంలో భారీగా నల్లమందు పట్లుబడింది. ఆ డ్రగ్స్ విలువ దాదాపు రూ. 2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
గుట్కా, లస్సీ, కాఫీ పౌడర్లతో కలిపి విక్రయిస్తున్నట్లు తేలింది. మిరాజ్ గుట్కా పేరుతో దుండగులు స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మీ ఇంట్లో పిల్లలు బయట డ్రింక్స్ తాగకుండా ఇంట్లోనే తయారు చేసి అందిస్తే హెల్త్‌కి మంచిది. సేఫ్‌గానూ ఉంటారు.