ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా చేసేందుకు అక్రమార్కులు కుయుక్తులు పన్నుతున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని చార్మినార్ దగ్గర డ్రగ్స్ అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
నిషేధిత H1 టాపెంటాడోల్ ట్యాబ్లెట్లు అమ్ముతున్నట్లు తెలిపారు.
అర్షద్ ఖాన్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చారిత్రక కట్టడం, పర్యాటక ప్రదేశం అయిన చార్మినార్ దగ్గర ఇటువంటి కార్యకలాపాలు జరుగుతుండటం సిగ్గుచేటు.
చార్మినార్‌ను చూడటానికి నిత్యం పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచే కాక విదేశాల నుంచి సైతం వస్తుంటారు.
పర్యాటకులకు డ్రగ్స్ విక్రయించేందుకు నిందితులు చార్మినార్ కేంద్రంగా గత కొంతకాలంగా సీక్రెట్ గా వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా పరిణామాలు హైదరాబాద్ చరిత్రను మసకబారేలా చేస్తున్నాయి.
ఇటువంటి విషయాలపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించాల్సిన అవసరం ఉంది.