Homeహైదరాబాద్latest NewsGroup 1 Exam : మనల్ని అనేదెవడ్రా?

Group 1 Exam : మనల్ని అనేదెవడ్రా?

నన్ను ఎవరూ పట్టుకోలేనే ధైర్యమా లేక నిర్లక్ష్యమా? మనల్ని అనేదెవడ్రా అని విర్రవీగి ఏకంగా ఎగ్జామ్‌కే మందు తాగి వచ్చాడు. తాగింది అభ్యర్థి కాదు. అధికారి. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే సరిదిద్దాల్సిందిపోయి తానే ఫుల్‌గా తాగి డ్యూటీ చేసే ప్రయత్నం చేశాడు. పాపం ఆయనకు ఏం ప్రాబ్లమ్ ఉందో మరి. ఇంట్లో వాళ్లావిడ ఏమైనా అందేమో!

గ్రూప్ 1 పరీక్ష విధులకు మద్యం తాగి వచ్చిన ఓ అధికారిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో జరిగింది. ఐడెంటిఫికేషన్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న పర్వేజ్ కు బ్రీత్ అనలైజర్ టెస్టు చేశారు. రీడింగ్ 170% వచ్చింది. వెంటనే అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతంగా జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img