Homeహైదరాబాద్latest NewsNarnoor : డ్రై డే ను అందరూ పాటించాలి

Narnoor : డ్రై డే ను అందరూ పాటించాలి

ఇదే నిజం, నార్నూర్: నార్నూర్ మండలం గుంజాల గ్రామపంచాయతీ సబ్ సెంటర్ లోని సోంజిగూడలో శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ చౌహాన్ చరణ్ దాస్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని సిజనర్ వ్యాధులైన మలేరియా,డెంగు వంటివి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఇళ్లలో ఉండే కుండీలలోని నీటిని రెండు రోజులకు ఒకసారి మార్చాలని ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచకూడదని,ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు.త్రాగే నీటిలో బ్లీచింగ్ పౌడర్ ఉపయోగించాలని,చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డ్ కు తరలించాలన్నారు.ఈ కార్యక్రమంలో హేమబిందు,ఎం ఎల్ పి హెచ్ పి ఈశ్వరి, విద్య రాణి,ఆశా కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img