Homeజిల్లా వార్తలుగిరిజన ఆశ్రమ పాఠశాలలో డీటీడీవో ఆకస్మిక తనిఖీలు

గిరిజన ఆశ్రమ పాఠశాలలో డీటీడీవో ఆకస్మిక తనిఖీలు

ఇదేనిజం, నల్లబెల్లి : నల్లబెల్లి మండల పరిధిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్​పై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయనున్నట్లు డీటీడీవో సౌజన్య తెలిపారు. మూడు చెక్కలపల్లి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో వార్డెన్ పద్మావతి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించడం లేదని, నాణ్యతలేని భోజనం పెడుతున్నారని సమాచారం. గురువారం ఆశ్రమ పాఠశాలను సౌజన్య ఆకస్మిక చేశారు. అనంతరం విద్యార్థులను కలిసి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్న లేదా అని తెలుసుకున్నారు. అలాగే సీసీ కెమెరాల పనితీరు, నైట్ వాచ్​మెన్ విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వ సూచించిన మెనూ ప్రకారం కాకుండాభోజన వసతి కల్పించడంలో వార్డెన్ అనుసరిస్తున్న విధానాలపై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని హెచ్ఎం సాంబయ్యను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడుతున్న వార్డెన్​పై చర్యలు తీసుకుంటామన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img