HomeతెలంగాణDubbaka by-election : నవంబర్​ 3న దుబ్బాక ఎలక్షన్​

Dubbaka by-election : నవంబర్​ 3న దుబ్బాక ఎలక్షన్​

Dubbaka by-election : రాష్ట్రం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుద‌లైంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 9న నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. నామినేష‌న్ల దాఖలుకు చివ‌రితేదీ అక్టోబ‌ర్ 16. న‌వంబ‌ర్ 3న దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.

10న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. నామినేష‌న్ల‌ను 17న ప‌రిశీలించనున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 19.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి అకాల మ‌ర‌ణంతో దుబ్బాక ఉప ఎన్నిక వచ్చింది. ఇప్ప‌టికే ఆయా పార్టీలు ప్ర‌చారం మొద‌లు పెట్టాయి.

ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌డంతో నేటి నుంచి దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రానుంది.

Recent

- Advertisment -spot_img