Homeలైఫ్‌స్టైల్‌Easy Weight loss : కష్టపడకుండా బరువు తగ్గండిలా...

Easy Weight loss : కష్టపడకుండా బరువు తగ్గండిలా…

Easy Weight loss : కష్టపడకుండా బరువు తగ్గండిలా…

Easy Weight loss – బరువు తగ్గాలంటే మనకి వెంటనే గుర్తొచ్చేవి రెండే విషయాలు – డైటింగ్, వర్కౌట్స్.

ఇవి మంచి టెక్నిక్స్, మంచి ఫలితాలని ఇచ్చే టెక్నిక్స్, హెల్దీ బాడీకి అవసరమైన టెక్నిక్స్ అనటంలో అబద్ధమేమీ లేదు.

కానీ, వీటి వల్ల బాగా అలసటగా ఉంటుంది, ఇది తినకూడదు, అది తినకూడదు లాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి.

ఫలితంగా, ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టినా కూడా మధ్యలో మానేస్తూ ఉంటాం.

అందుకే ఇక్కడ కొన్ని సింపుల్ వెయిట్ లాస్ టిప్స్ ఉన్నాయి.

ఈ టిప్స్ ఫాలో అయ్యేటప్పుడు ఎలాంటి ఫాస్టింగ్ అక్కర్లేదు, హెవీ ఎక్సర్‌సైజులు చేసే పనీ లేదు. అవేమిటో చూసేద్దామా.

నమిలి తినండి..

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన మొట్ట మొదటి రూల్ ఇదే.

ఇది చాలా సింపుల్ కూడా. వెయిట్ లాస్ లాంగ్వేజ్ లో దీన్ని గోల్డెన్ రూల్ అని కూడా అంటారు.

నమిలి తినడం వల్ల నెమ్మదిగా తింటారు, అంతే కాక మీరు ఉప్పుడే తిన్నారు అన్న సంగతి మీ శరీరం అర్ధం చేసుకోవడానికి సరిపడా టైమ్ ఉంటుంది.

ఫలితంగా మీరు ఎంత తినాలో అంతే తింటారు తప్ప ఇంకా ఎక్కువగా తినే ఛాన్స్ ఉండదు.

వెయిట్ గెయిన్ కి మొదటి మెట్టు ఎక్కువ తినడమే. ఈ విషయం లో జాగ్రత్త వహిస్తే ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసినట్లే.

చిన్న ప్లేట్ తీసుకోండి..

ఆహారం తీసుకునేటప్పుడు ఎంత తీసుకుంటున్నామో గమనించుకోవడం ఎంతో ముఖ్యం.

అందుకని, మీరు డైట్ లో లేకపోయినా కూడా చిన్న ప్లేట్ లో సర్వ్ చేసుకోవడం మీరు ఊహించలేనంత బెనిఫిట్స్ ని చేకూరుస్తుంది.

ఆహారం తగ్గించి తీసుకోవడమే కాక, ఈ పని వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు కూడా అనిపిస్తుంది.

భోజనానికి ముందు నీరు..

మీకు బాగా ఆకలిగా ఉండి ఏదైనా సరే తినేయాలి అనుకున్నప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలి.

ఇప్పుడే ఎక్కువ తినేసే ఛాన్స్ ఉంది. అందుకని, ఇలాంటి సందర్భాల్లో ఈ ట్రిక్ ఉపయోగించండి.

మీరు చేయవలసిందల్లా బాగా నీరు తాగడమే.

ఈ పని చేయడం వల్ల మీ క్రేవింగ్స్ తగ్గడమే కాక మీకు పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది, ఆటోమేటిక్ గా తక్కువ తింటారు.

నో బింజ్ ఈటింగ్..

మూవీ చూస్తూనో, చాట్ చేస్తూనో ఏదైనా తినడం సరదాగా ఉంటుంది.

ఆ ఎంత తింటాంలే అనుకుంటాం. కానీ, మీరు ఒకసారి లెక్క వేసి చూసుకుంటే తెలుస్తుంది, ఎంత బింజ్ ఈటింగ్ జరిగిందనేది.

మీ రెగ్యులర్ మీల్స్ తో పాటూ ఎన్ని ఎక్కువ క్యాలరీలను మీరు తీసుకున్నారో అర్ధమవుతుంది.

అందుకని, బింజ్ ఈటింగ్ కి చాలా స్ట్రిక్ట్ గా నో చెప్పండి, దాని రిజల్ట్స్ కూడా మీకు అతి త్వరగానే కనపడతాయి.

ఒత్తిడికి దూరంగా..

అతిగా తినడం, ఒక పద్ధతి లేకుండా తినడం, భోజనం చేసిన అరగంట లోనే మళ్ళీ ఆకలిగా అనిపించడం… వీటికి రెండు ముఖ్యమైన కారణాలుంటాయి.

అవే ఒత్తిడి, ఆందోళన. ఇవి రెండూ ఉన్నప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది.

ఈ హార్మోన్ వల్ల ఆకలి పెరుగుతుంది, మీకు కంఫర్ట్ ఫుడ్ వైపు మనసు లాగుతుంది.

ఈ మధ్య కాలం లో ఎక్కువ గా బరువు పెరిగారని మీకు అనిపిస్తుంటే ఏమైనా ఆందోళన చెందారా, ఒత్తిడి కి గురయ్యారా అని ఆలోచించుకోండి.

మీకు స్ట్రెస్‌ఫుల్ గా అనిపించినప్పుడు వాకింగ్ చేయడం, ఫ్రెండ్ తో మాట్లాడడం వంటి పనుల ద్వారా మనసు మరల్చుకోడానికి ట్రై చేయండి.

హాయిగా నిద్ర..

నిద్ర తక్కువయినా కూడా బరువు పెరుగుతారంటే నమ్మశక్యం గా లేదు కదా, కానీ ఇది నిజమే. నిద్ర సరిపోనప్పుడు జరిగే హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల బరువు పెరుగుతుంది.

అందుకని, శరీరానికీ, మనసుకీ తగినంత విశ్రాంతినివ్వండి.

జంక్ ఫుడ్ వద్దు.. (Easy Weight loss)

జంక్ ఫుడ్ ఎందుకు వద్దో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

చిన్న పేస్ట్రీయే కదా అనుకుంటాం, ఒక్క మఫిన్ తింటే ఏమౌతుందిలే అనుకుంటాం.. కానీ వీటి వల్ల కడుపు నిండదు, క్యాలరీలు ఎక్కువగా తీసుకున్నట్టవుతుంది.

అందుకని, ఈ విషయంలో కూడా స్ట్రిక్ట్ గా ఉండాలి మీరు.

హెల్దీ స్నాక్స్.. (Easy Weight loss)

స్నాక్స్ హెల్దీగా కూడా ఉండవచ్చు కదా. ఫ్రూట్స్ తీసుకోవడం మంచి ఆప్షన్.

నట్స్ కూడా తీసుకోవచ్చు కానీ, ఉప్పు చల్లినవి కాదు. యోగర్ట్ తీసుకోవచ్చు.

ఇలాంటి ఆల్టర్నేటివ్స్ వలన స్నాకింగ్ కూడా హెల్దీగానే జరుగుతుంది.

Recent

- Advertisment -spot_img