కొందరు లంచ్ సమయంలో జంక్ ఫుడ్‌ను తీనడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగిపోతాయి. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. ఇంకొందరు లంచ్ చేయకుండా చాక్లెట్లు, బిస్కెట్లు తింటున్నారు. ఈ పదార్థాల్లో ఉండే మైదా పిండి, చక్కెర మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు కారణమవుతాయి. మరికొందరు ప్రాసెస్ చేయబడిన మాంసాహారం తినడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.