Homeహైదరాబాద్latest Newsటీ తాగుతూ ఇవి తింటే అంతే సంగతులు : Health News

టీ తాగుతూ ఇవి తింటే అంతే సంగతులు : Health News

చాయ్ అనేది ప్రజల దైనందిన జీవితంతో ముడిపడి ఉంది. చాలా మందికి టీ తాగకుండా రోజు గడవదు. భారతీయ సంస్కృతిలో టీ కూడా ఒక భాగంగా మారిపోయింది. ఉదయం లేదా సాయంత్రం, టీ తాగకుండా చాలామందికి రోజు పూర్తి కాదు. అయితే, టీతో పాటు స్నాక్స్ తినడం కూడా మహా సరదాగా ఉంటుంది. కానీ, ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి అనే విషయం మాత్రం ఖచ్చితంగా మనకు తెలిసుండాలి. ఎక్కువగా పకోడీ, మిక్సర్, వంటివి పప్పు పిండిని ఉపయోగించి తయారుచేసిన చిరుతిళ్లను టీతో తినడానికి ఇష్టపడతారు. శనగపిండితో చేసిన చిరుతిళ్లు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కలిగిస్తాయని వారు గుర్తించరు. అదే సమయంలో పోషకాలను గ్రహించే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి, టీ తాగేటప్పుడు ఈ చిరుతిండికి దూరంగా ఉండండి. టీ వంటి హాట్ డ్రింక్ తాగిన తర్వాత కనీసం 30 నిమిషాల పాటు చల్లని ఆహారం తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక, లెమన్ టీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుందని ఎప్పుడైనా విన్నారా? నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, ఇది మీకు వికారం మరియు ఉబ్బిన అనుభూతిని కలిగిస్తుంది. నిమ్మరసం టీని మరింత ఆమ్లంగా మారుస్తుంది మరియు ఉబ్బరం కలిగిస్తుంది. ఉదయాన్నే లెమన్ టీ తాగకూడదని నిపుణులు సిఫార్సు చేయడానికి అసలు కారణం ఇదే. టీలో టానిన్లు మరియు ఆక్సలేట్ ఉంటాయి. ఇది శరీరంలో ఇనుము శోషణను నిరోధిస్తుంది. చాయ్ తాగేముందు కానీ, తగిన తరువాత కానీ, ఒక 30 నిముషాలు గింజలు, ధాన్యాలు మరియు ఆకు కూరలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి.

Recent

- Advertisment -spot_img