కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అనుమతి ఇచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. గన్‌పార్కులో అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖలకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు.