Homeతెలంగాణఈనెల 16 నుంచి ఈసెట్‌ కౌన్సెలింగ్‌

ఈనెల 16 నుంచి ఈసెట్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుద‌ల‌ చేసింది. ఈనెల 16 నుంచి 23 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌కు అవకాశమిచ్చారు. 19 నుంచి 23 వరకు ఈసెట్‌ అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. 19 నుంచి 25 వరకు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేయాలి. 28న సీట్లు కేటాయించనున్నారు. అక్టోబర్‌ 6 నుంచి తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 6, 7 తేదీల్లో తుది విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. అక్టోబర్‌ 9న తుది విడత సీట్ల కేటాయింపు జరపనున్నారు. అనంతరం స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. ఈసెట్‌లో ఈ ఏడాది 97.58శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి వెల్లడించారు. ఆగస్టు 31న కొవిడ్‌ -19 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈసెట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img