Homeహైదరాబాద్latest Newsరంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ను ప్రశ్నించిన ఈడీ

రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ను ప్రశ్నించిన ఈడీ

రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌ను ఈడీ ఏడున్నర గంటల పాటు విచారించింది. రంగారెడ్డి జిల్లాలో భూకేటాయింపుల అక్రమాల కేసులో అమోయ్ కుమార్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన ఈరోజు ఉదయం 8 గంటలకు మీడియా కంట పడకుండా బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు.ఈడీ అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఆయనను విచారించారు. వందల కోట్ల రూపాయల విలువైన 42 ఎకరాల భూమిని అక్రమంగా ఎలా బదలాయించారని ఇడి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అమోయ్ కుమార్ గతంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు.

Recent

- Advertisment -spot_img