Homeహైదరాబాద్latest NewsEDUCATION: 'NITHM'లో టూరిజం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

EDUCATION: ‘NITHM’లో టూరిజం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ఇదే నిజం, కరీంనగర్ ఎడ్యుకేషన్: నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ (నిథమ్) గచ్చిబౌలి, హైదరాబాద్ లో టూరిజం కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆమోదిత కళాశాల నిధంలో ఇంటర్, డిగ్రీలో బీఎస్సీ, బీబీఏ, ఎంబీఏ అడ్మిషన్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇందులో టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూ లతో పాటు దేశంలోని హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మంచి వేతనంతో అనేక అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అడ్మిషన్, ఇతర వివరాలకు జిల్లా పర్యటక శాఖ కార్యాలయం, కరీంనగర్ లో గాని, జిల్లా పర్యాటక శాఖ అధికారి 9440816070లో సంప్రదించాలని కోరారు.

Recent

- Advertisment -spot_img