Homeతెలంగాణతెలంగాణాలో విద్యాసంస్థలు తెరుచుకుంటాయా..

తెలంగాణాలో విద్యాసంస్థలు తెరుచుకుంటాయా..

సెప్టెంబర్​ మొదటి వారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోవచ్చని కేంద్రం రాష్ట్రాలకు సూచనలిచ్చింది. అయితే కొన్ని ప్రధాన జాగ్రత్తలు తీసుకుని తరగతులు నిర్వహించుకునేలా పలు కీలక మార్గనిర్దేశకాలను కేంద్రం ఇచ్చింది. అయితే దీనిపై ఆయా రాష్ట్రాలకే పూర్తి నిర్ణయాధికారం కూడా కల్పించింది కేంద్రం. దీంతో పలు రాష్ట్రాలలో ఇప్పటికే జరగాల్సి ఉన్న పరీక్షలను నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా కొన్నఇ రాష్ట్రాలు నూతన అడ్మిషన్లకు సంబందించి మార్గదర్శకాలను తయారు చేసే పనిలో ఉన్నాయి. అయితే డిల్లీ రాష్ట్రంలో మాత్రం ఇప్పట్లో విద్యాసంస్థలకు అనుమతి ఇచ్చేది లేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సీఎం కేజ్రీవాల్ ప్రకటన కూడా చేశారు. ఇతర కొన్ని రాష్ట్రాలు కూడా ఇప్పట్లో విద్యాసంస్థలు తెరిచేందుకు సుముఖంగా లేవు. అయితే తెలంగాణాలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేచి చూస్తున్నారు. మరో వైపు తల్లిదండ్రుల సంఘాలు ఈ విద్యాసంవత్సరాన్ని ఎక్కడ ఆగిందో తిరిగి వచ్చే విద్యాసంవత్సరం అక్కడ నుంచే కొనసాగించాలని​ కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img