Homeతెలంగాణeetala: ఆసరా పింఛన్లపై ఈటల సెన్సేషనల్ కామెంట్స్

eetala: ఆసరా పింఛన్లపై ఈటల సెన్సేషనల్ కామెంట్స్

ఇదేనిజం, హైదరాబాద్: బీజేపీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులకు పింఛన్ ఇస్తామని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సంపన్నులకు రైతు బంధు కట్ చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ను గద్దె దించే వరకు బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పారు. దశలవారీగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. రైతు బంధు అనేది సంపన్నులకు అవసరం లేదని అన్నారు. సోమవారం (జూలై 24) ఈటల రాజేందర్ హన్మకొండలో మీడియాతో మాట్లాడారు. తాము కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి తొలగించే వరకూ విశ్రమించబోమని ఈటల రాజేందర్ చెప్పారు. ప్రభుత్వాన్ని గద్దె దించేవరకూ బీజేపీ దశల వారీగా ఆందోళన చేస్తుందని అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలు అయిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

తెలంగాణలో వివిధ సంక్షేమ పథకాల పేరుతో ఖర్చుచేస్తున్న డబ్బులు కేవలం రూ.25 వేల కోట్లు మాత్రమే ఉంటోందని, మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాదికి రూ.45 వేల కోట్లు ఉంటోందని అన్నారు. మద్యం తాగుతున్న పేదలు ద్వారా వచ్చే డబ్బులను కూడా వారి కోసం ఖర్చు చేయడం లేదని విమర్శించారు.

Recent

- Advertisment -spot_img