Homeహైదరాబాద్latest NewsEJS students pays tribute to Ramoji Rao  : మీడియా బ్యారన్ కు ఘన నివాళి

EJS students pays tribute to Ramoji Rao  : మీడియా బ్యారన్ కు ఘన నివాళి

EJS students pays tribute to Ramoji Rao

అక్షరజ్ఞానం నేర్పించిన మాస్టారు  ఇక లేరనే వార్త తెలిసి ఈనాడు జర్నలిజం స్కూల్ (ఈజేఎస్) విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మీడియా బ్యారన్ రామోజీ ఈ లోకం నుంచి విశ్రమించారని తెలిసి ప్రముఖులు విషన్న వదనంతో సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. విశ్వసనీయతతో కూడిన సమాచారాన్నిచే శ్రేయోభిలాషి తనువు చాలించారని పాఠకులు చింతిస్తున్నారు. విలువలు, విశ్వసనీయత, కచ్చితత్వంతో పాటు సమస్యల మూలాలు, పోరాటం, పరిష్కారానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రన్ అవుతోన్న మీడియా సంస్థల్లో చాలావరకు ఈనాడు ఉద్యోగులే. అంతలా విస్తరించిది ఆ సామ్రాజ్యం. కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. దేశంలోనే ప్రముఖ పత్రికల్లో టాప్ 5 లో ఉండే ఈనాడు దినపత్రిక మరో రెండు నెలల్లో 50 వసంతాలు పూర్తి చేసుకోనుంది. ఆ మధుర క్షణాలను ఆస్వాదించకుండానే ఆయన కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. 

Recent

- Advertisment -spot_img