Homeహైదరాబాద్latest Newsప్రమాదం జరిగితేనే….. స్పందిస్తారా?

ప్రమాదం జరిగితేనే….. స్పందిస్తారా?

ఇదే నిజం, వేమనపల్లి : వేమనపల్లిలోని మండలంలోని ముల్కలపేట గ్రామం నుంచి రాచర్ల, వెంచపల్లి వెళ్లే ప్రధాన రోడ్డులో ఓ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. చర్చి పక్కన పడిపోవడానికి సిద్ధంగా ఉన్న కరెంటు స్తంభాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రోడ్డుకు ఇరువైపులా రెండు స్తంభాలు కుంగిపోయి ఉండటంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img