Homeసినిమాఎమెషనల్​ కంటెంట్​ హైలెట్​గా నిలుస్తుందట..!

ఎమెషనల్​ కంటెంట్​ హైలెట్​గా నిలుస్తుందట..!

నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్​గా కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన మూవీ ‘హాయ్ నాన్న’. నాని కెరీర్​లో 30వ సినిమాగా ఇది తెరకెక్కగా ఇప్పటివరకు వచ్చిన పాటలు, ప్రమోషన్స్ మంచి బజ్​ను తీసుకొచ్చాయి. ఈ డిసెంబర్​ 7న రిలీజ్​ కానున్న ఈ మూవీపై మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్​తో ఉన్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం హాయ్​ నాన్నలో ఎమోషనల్​ కంటెంట్ హైలెట్​గా నిలుస్తుందట. అనుకున్నదానికన్నా ఈ సినిమాలో ఎమోషన్ చాలా హైలైట్ అవుతుందని తెలుస్తోంది. నాని కెరీర్​లో హాయ్ నాన్న ఓ చెరిగిపోని ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుందేమో చూడాలి. ఈ మూవీకి హేషం అబ్దుల్ వహెద్ సంగీతం అందించగా వైరా ఎంటర్​టైన్​మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

Recent

- Advertisment -spot_img