Employees : 2025 బడ్జెట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు (Employees) శుభవార్త అందించింది, మోడీ ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల పెన్షన్ 53 శాతానికి పెరిగిన తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఉపశమనం కోసం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వేతన కమిషన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో, కమిషన్ త్వరలో ఒక ఛైర్మన్ మరియు ఇద్దరు సభ్యులను నియమిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్ సమావేశం అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది.