Homeహైదరాబాద్latest Newsముగిసిన TTD ధార్మికోపన్యాసాలు..

ముగిసిన TTD ధార్మికోపన్యాసాలు..

– రామాయణ,భారతాలు..భారతీయుల ఆత్మ.
– ప్రవచకులు కళాధర్ రాజు

ఇదే నిజం,నెల్లికుదురు: మహా పుణ్యకావ్యాలైన రామాయణం, మహాభారత గ్రంథాలు భారతీయులకు ఆత్మ లాంటివని, ఇవి ప్రతి ఒక్కరి జీవితాలతో పెనవేసుకొని ఉన్నాయని ప్రముఖ ప్రవచకులు, ప్రజా వైద్యుడు ఆదోరి కళాధర్ రాజు ఉద్బోధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ రామ్ రెడ్డి కృష్ణమూర్తి నిర్వహణలో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి శివాలయంలో ఈనెల 20 నుంచి 24వరకు జరిగిన ధార్మిక కార్యక్రమాలు శనివారం ముగిశాయి. వీటిలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. శనివారం కళాధర్ రాజు భక్తులకు ప్రవచనాలు వినిపిస్తూ.. బాల్యం నుంచే తమ పిల్లలకు రామాయణ, మహాభారతం పట్ల ఆసక్తి పెంచేలా తల్లిదండ్రులు చొరవచూపితే నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కవి, ఏకపాత్రాభినయం, కోలాట కళాకారుడు బొమ్మిడి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో హైమ, సుమలత, వెంకటలక్ష్మిలతో కూడిన కళాబృందం భజనలు, పలు కోలాటనృత్య ప్రదర్శనలు భక్తులను, గ్రామస్తులను అలరించాయి.

Recent

- Advertisment -spot_img