అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ‘దూత’వెబ్ సిరీస్‌తో సక్సెస్ కొట్టిన అక్కినేని నాగచైతన్య మంచి జోష్‌లో ఉన్నాడు. తాను నటించిన మొదటి వెబ్ సిరీస్‌తోనే హిట్ కొట్టిన నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్’ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. చైతూ కెరీర్లోనే భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ మూవీని టాలెంటెడ్ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చైతూ ఒక కంప్లీట్ మాస్ లుక్ లో కనిపించనుండగా మేకర్స్ లేటెస్ట్గా ఓ సాలిడ్ అప్డేట్ను అందించారు. దీంతో ఈ మూవీ షూటింగ్‌ను లేటెస్ట్గా సముద్రం మధ్యలో ఓ కొత్త షెడ్యూల్లో స్టార్ట్ చేస్తున్నట్లుగా చైతూపై ఓ ఎనర్జిటిక్ స్టిల్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఈ క్రేజీ అప్డేట్తో అక్కినేని ఫ్యాన్స్‌కు మేకర్స్ మంచి కిక్ ఇచ్చారు. ఇక ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. అలాగే గీతా ఆర్ట్స్ 2 వారు మాసివ్ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.